స్మార్ట్ కిడ్జ్ లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రధానం.

స్మార్ట్ కిడ్జ్ లో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ విజేతలకు బహుమతుల ప్రధానం.

 ఖమ్మం బ్యూరో, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు)

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఇంటర్నేషనల్ ఒలంపియాడ్స్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సోమవారం మెడల్స్ ప్రధానం చేశారు. ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ వారు గణితం, సైన్స్,ఇంగ్లీష్ ఒలంపియాడ్ పరీక్షలను గతంలో నిర్వహించారు. ఈ ఒలంపియాడ్స్ లో 60 మంది చిన్నారులు తమ ప్రతిభ పాఠవాలతో విజేతలుగా నిలవడంతో సోమవారం పాఠశాలలో జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో చిన్నారులకు పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మెడల్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో వ్యక్తిగత శ్రద్ధతో నిరంతరం ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. అంతర్జాతీయ,జాతీయ, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోటీలలో తమ పాఠశాల చిన్నారులు విజేతలుగా నిలిచి పాఠశాల ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నారని తెలిపారు. గణితం, సైన్స్, ఇంగ్లీష్ విభాగాలలో అత్యున్నత ప్రతిభావంతులుగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .