ఆయిల్ పామ్ గెలల ధరలో ప్రైవేట్ కంపెనీల జోక్యం అంగీకరించం.

ఆయిల్ పామ్ గెలల ధరలో ప్రైవేట్ కంపెనీల జోక్యం అంగీకరించం.

- అత్యధిక దిగుబడి ఆధారంగానే ధర నిర్ణయం.
- ఆలపాటి రామచంద్ర ప్రసాద్.

అశ్వరావుపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయంలో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న కుట్రలను న్యాయపరంగా తిప్పికొడతామని ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. మండలంలోని అల్లిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అశ్వరావుపేట, పెదవేగి కర్మాగారాల నూనె దిగుబడిని సరాసరి చేసి గెలలకు ధర నిర్ణయించేవారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అప్పారావుపేటలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో కొత్త ఆయిల్ పామ్ కర్మాగారాన్ని నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పండిన ఆయిల్ పామ్ గెలలను అశ్వరావుపేట కర్మాగారం నిలిపివేస్తే అప్పారావుపేటలో, అప్పారావుపేట కర్మాగారం ఆపితే అశ్వరావుపేటలో గానుగ ఆడించడం జరుగుతుందని వివరించారు. రెండు కర్మాగారాల్లో అత్యధిక నూనె దిగుబడి సాధించిన కర్మాగారాన్ని ఆధారంగా చేసుకుని రైతులకు గెలల ధర నిర్ణయించాలని ఆయిల్ పామ్ రైతు సంఘం తరఫున చేసిన పోరాటం ఫలించిందన్నారు.
గత ఐదేళ్లుగా అత్యధిక దిగుబడి సాధిస్తున్న అప్పారావుపేట ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఆధారంగా చేసుకుని రైతులకు గెలల ధరను ఆయిల్ ఫెడ్ చెల్లిస్తోందని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కర్మాగారం కూడా పూర్తి చేయని ఏడు ప్రైవేట్ కంపెనీలు కలిసి అశ్వరావుపేట, అప్పారావుపేట కర్మాగారాల ఆయిల్ రికవరీని సరాసరి చేసి గెలల ధర నిర్ణయించాలని ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీల కుట్రలను అడ్డుకుని రైతులకు అత్యుత్తమ దిగుబడి ఆధారంగా గెలల ధర దక్కేలా చేయడానికి ఆయిల్ పామ్ రైతు సంఘం తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయవాదులతో ఈ నెల 26న హైకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు పైడి వెంకటేశ్వరరావు, కె.వి. సత్యనారాయణ, కొయ్యల అచ్యుతరావు, దొడ్డా ప్రసాద్, ఎర్ర వసంతం, మన్నెం అప్పారావు, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .