నాగారం–రాంపల్లి ప్రాంత కాలనీలకు ఐక్య కమిటీ ఏర్పాటు

నాగారం–రాంపల్లి ప్రాంత కాలనీలకు ఐక్య కమిటీ ఏర్పాటు

నాగారం, మార్చి 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ సర్కిల్ నాగారం డివిజన్ నాగారం–రాంపల్లి ప్రాంతాలకు చెందిన వివిధ కాలనీల అధ్యక్షులు, కార్యదర్శుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, నివాసితుల సంక్షేమంపై విస్తృతంగా చర్చించారు. అన్ని కాలనీల అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ సమిష్టిగా పనిచేయడానికి సభ్యులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఐక్య కమిటీ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి పౌర సమస్యల పరిష్కారానికి కృషి చేయనుంది. సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో చర్యలు తీసుకునేలా పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.కొత్తగా ఎన్నికైన కమిటీ నాగారం, రాంపల్లి ప్రాంతాల కాలనీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఐక్యత, పారదర్శకత, అంకితభావంతో పనిచేస్తామని వెల్లడించింది.కమిటీ అధ్యక్షుడిగా మాజీటి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ రాజు, ఉపాధ్యక్షులుగా చదలవాడ దేవి వరప్రసాద్ రావు, జాయింట్ సెక్రటరీగా పి. కుమార్ యాదవ్, ఖజాంచీగా ఎం. శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా టీ. రామ్ రెడ్డి, పి.వి. రాఘవరావు, ఎస్. భాస్కర్ రెడ్డి, హనుమంతరావు ఎంపికయ్యారు.కోఆర్డినేటర్లుగా టీ. జలంధర్ చారి, ఆర్. బాలాజీ చౌదరి, ఎం. రాజేందర్, ఎం. రామకృష్ణ, కిషన్ నాయక్, రాములు, బాలా చారి, ఏ. నరేందర్, కృష్ణ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అడ్వైజరీ కమిటీ సభ్యులుగా తెల్ల శ్రీధర్, గంగరాజు హరికృష్ణ, రవీందర్ తివారి, దేవరశెట్టి రాజశేఖర్ నియమితులయ్యారు. లీగల్ అడ్వైజర్‌గా విజయ్ కుమార్ రామేవత్‌ను నియమించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News