వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.

వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.

- సత్తుపల్లి–హైదరాబాద్ మార్గంలో 6 ఏసీ, 17 సూపర్ లగ్జరీ బస్సులు.
- సమయపాలన వివరాలు వెల్లడించిన డిపో మేనేజర్.
- గురిజాల లక్ష్మీనారాయణ.

సత్తుపల్లి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్తుపల్లి డిపో నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులను నడుపుతున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తుపల్లి నుండి హైదరాబాద్‌కు, అలాగే హైదరాబాద్ నుండి సత్తుపల్లికి ప్రతిరోజు 6 ఏసీ బస్సులు, 17 సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

 *సత్తుపల్లి నుండి హైదరాబాద్ ఏసీ బస్సుల సమయాలు:* 

(బీహెచ్ఈఎల్) కు ఉదయం 7.45, 9.15, 10.00 గంటలకు, రాత్రి 9.00, 9.45, 10.30 గంటలకు ఏసీ బస్సులు బయలుదేరుతాయి. బీహెచ్ఈఎల్ నుండి సత్తుపల్లికి ఉదయం 8.00, 9.00, 10.00 గంటలకు, రాత్రి 9.00, 10.00, 11.00 గంటలకు బస్సులు నడుస్తాయి.

 *సత్తుపల్లి నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు:* 

ఉదయం 3.40 (ఎంజీబీఎస్), 5.10 (ఎంజీబీఎస్), 6.00 (బీహెచ్ఈఎల్), 7.30 (ఎంజీబీఎస్), 8.20 (బీహెచ్ఈఎల్), 8.45 (జీడిమెట్ల), 9.40 (ఈసీఐఎల్), 10.45 (ఎంజీబీఎస్) గంటలకు బయలుదేరుతాయి. మధ్యాహ్నం 12.30, 2.00, 3.30 గంటలకు ఎంజీబీఎస్‌కు బస్సులు ఉంటాయి. సాయంత్రం 4.00 గంటలకు ఎంజీబీఎస్‌కు బస్సు నడుస్తుంది. రాత్రి 9.00 (ఈసీఐఎల్), 9.30 (బీహెచ్ఈఎల్), 10.00 (బీహెచ్ఈఎల్), 10.15 (జీడిమెట్ల), 10.40 (గచ్చిబౌలి), 11.15 (లహరి స్లీపర్) కు బస్సులు ఉన్నాయి.

 *హైదరాబాద్ నుండి సత్తుపల్లి సూపర్ లగ్జరీ బస్సులు:* 

ఉదయం 4.40, 5.50 గంటలకు ఎంజీబీఎస్ నుండి, 6.20 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి, 7.00 గంటలకు ఎంజీబీఎస్ మరియు బీహెచ్ఈఎల్ నుండి, 7.15 గంటలకు జీడిమెట్ల నుండి, 9.00 గంటలకు ఈసీఐఎల్ నుండి, 11.15 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి బస్సులు నడుస్తాయి. మధ్యాహ్నం 2.20 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సు బయలుదేరుతుంది. సాయంత్రం 4.15, 6.00 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సులు ఉంటాయి. రాత్రి 8.40 గంటలకు గచ్చిబౌలి నుండి, 8.45 గంటలకు ఎంజీబీఎస్ నుండి, 9.00 గంటలకు ఈసీఐఎల్ నుండి, 9.20 గంటలకు జీడిమెట్ల నుండి, 9.20 గంటలకు లహరి స్లీపర్ బీహెచ్ఈఎల్ నుండి, 9.40 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి బస్సులు నడుస్తాయి.
అదేవిధంగా సత్తుపల్లి నుండి తిరుపతికి మధ్యాహ్నం 3 గంటలకు, అలాగే తిరుపతి నుండి సత్తుపల్లికి IMG-20260313-WA0055మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్ తెలిపారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురిజాల లక్ష్మీనారాయణ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .