మాటు చెరువు గండిపడడంతో రైతుల ఆందోళన

మాటు చెరువు గండిపడడంతో రైతుల ఆందోళన

ఎల్కతుర్తి. మార్చి 1 (తెలంగాణ ముచ్చట్లు) 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం అనంతసాగర్ గ్రామం సరిహద్దులోని మాటు చెరువు గండిపడడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చెరువు కట్ట దెబ్బతిని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోవడంతో పంటలకు అవసరమైన నీటి నిల్వ లేకుండా పోయింది.
ఈ చెరువు నీటిపై ఆధారపడి సుమారు మూడు వందల మంది రైతులు తమ పంట పొలాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతాయనే భయం రైతుల్లో నెలకొంది.
చెరువుకు అనుసంధానంగా ఉన్న వంతెనలు కూడా నీటి ప్రవాహానికి కూలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తక్షణ చర్యలు తీసుకోకపోతే రానున్న వర్షాకాలంలో కూడా నీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రైతులు తమ సొంత డబ్బులతో ఇసుక సంచులు తెచ్చి గండిపడిన ప్రాంతంలో తాత్కాలిక అడ్డుకట్ట వేస్తూ నీరు బయటకు పోకుండా కాపాడుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారమేనని, ప్రభుత్వంవెంటనే స్పందించి చెరువు ఆనకట్టకు శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు.IMG-20260301-WA0096
రైతుల సమస్యను గుర్తించి అధికారులు తక్షణమే పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .