ఆంగ్ల భాషపై “అదుర్స్”సరస్వతి విద్యార్థులు

ఆంగ్ల భాషపై “అదుర్స్”సరస్వతి విద్యార్థులు

జోగులంబ గద్వాల,మార్చి01(తెలంగాణ ముచ్చట్లు):

ఎర్రవల్లి మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆంగ్ల భాష సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రస్తుత విద్యాశాఖ అధికారి అమీర్ పాషా, మాజీ విద్యాశాఖ అధికారి ఈ రాజు, గ్రామ సర్పంచ్ అనిత కృష్ణ సాగర్ హాజరై ప్రారంభించారు.

చిన్నారులు ఆంగ్ల భాష ప్రాధాన్యతను తెలియజేస్తూ వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. తమ కార్యాచరణలను పూర్తిగా ఆంగ్లంలో వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను, పాఠశాల యాజమాన్యం కృషిని అతిథులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే కూడలి నమూనా, ప్రాథమిక సరస్వతి ఆరోగ్య కేంద్రం నమూనా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఆంగ్ల రచయిత విలియం షేక్స్పియర్ రచించిన “ద మర్చంట్ ఆఫ్ వెనిస్” నాటకంలోని భాగాలను విద్యార్థులు ప్రదర్శించి అందరినీ అలరించారు.అదే విధంగా సరస్వతి వాణి ధ్వని ప్రసార వేదికను మరియు సామాజిక మాధ్యమ పుటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.IMG-20260301-WA0086IMG-20260301-WA0084

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .