మాదిగ అమరవీరులకు ఘన నివాళి

అమరవీరుల త్యాగ ఫలితమే వర్గీకరణ సాధనం

మాదిగ అమరవీరులకు ఘన నివాళి

వనపర్తి,మార్చి1(తెలంగాణ ముచ్చట్లు):

అనుసూచిత జాతుల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగిన దీర్ఘకాల పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి 1న తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాదిగ ఉద్యోగుల వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అనుసూచిత జాతుల వర్గీకరణ సాధన మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు.సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాగిన పోరాట ఫలితంగా వర్గీకరణ సాధ్యమైందని, ఈ సాధనలో అమరవీరుల పాత్ర కీలకమైందని అన్నారు.సమితి సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ, ప్రజా వక్త రాజారాం ప్రకాష్ మాదిగ తదితరులు మాట్లాడుతూ.. అమరవీరుల ఆశయ సాధన కోసం కృషి కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం నాయకులు అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, ఎం డి ఖాదర్ పాషా, విశ్వం బాబు, జె కురుమూర్తి, కొమ్ము చెన్నయ్య మాదిగ, కేశవులు మాదిగ, గట్టుస్వామి మాదిగ, సిరీన్ మాదిగ, గంధం నాగరాజు మాదిగ, వంగలి నాగరాజు మాదిగ, జి టి శ్యామ్, గద్వాల ఆంజనేయులు, గొర్ల శైలాన్ కుమార్, పెరుమాళ్ల నాగరాజు మాదిగ, గోపాల్ మాదిగ, నాగన్న మాదిగ, కొమ్ము వెంకటేష్ మాదిగ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య పీచర గ్రామంలో ఎడపేల్లి రాజమ్మకు నివాళులు అర్పించిన డా. తాటికొండ రాజయ్య
వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన ఎడపేల్లి రాజమ్మ మరణించగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్...
పీచర గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగకు ఘన ఏర్పాట్లు
అంకమ్మ తల్లి తిరునాళ్లకు కోమట్లగూడెం సిద్ధం
కరాటే ఛాంపియన్  సన్మానించిన డాక్టర్స్ 
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌
పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన డి జి పి 
లాల్ బహాదుర్ స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవం