మరోసారి మానవత్వం చాటుకున్న పల్లా కిరణ్
ఖమ్మం బ్యూరో, మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు)
మరోసారి ప్రజాబంధువు గా బడుగు బలహీన వర్గాలకు అండగా మానవత్వాన్ని చాటుకున్న పల్లా కిరణ్.
పీడిత ప్రజల నాయకులు, పేదల పక్షపాతి స్వర్గీయ క్రీ. శే. పల్లా జాన్ రాములు కుమారుడు ప్రముఖ సమాజ సేవకులు, యువ నాయకులు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో "ఉచిత మెగా కంటి వైద్య శిబిరం" మరియు "రక్తదాన శిబిరానికి" భారీ స్పందన తో విజయవంతమైంది. ఖమ్మం ప్రముఖ మిషన్ హాస్పిటల్ ప్రాంగణం లో పల్లా కిరణ్ చే నిర్వహించబడిన "ఉచిత మెగా కంటి వైద్య శిబిరము" మరియు రక్తదాన శిబిరం భారీగా విజయవంతమైంది.
ఈ శిబిరానికి సుమారు 1000 మందికి పైగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు పాల్గొని, నిపుణులైన డాక్టర్ల తో వైద్యం చేయించుకున్నారు. వీరికి ఉచితంగా కంటికి సంబంధించిన మందులు మరియు కళ్ళజోళ్ళు పల్లా కిరణ్ ఉచితంగా అందజేశారు. పల్లా కిరణ్ పిలుపుతో పెద్దఎత్తున దాతలు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం లో దాతలు ఇచ్చిన రక్త యూనిట్స్ ని సేకరించి, నిరుపేదలకు ఉపయోగపడే విధంగా పల్లా కిరణ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అందజేశారు.
ఈ మెగా కంటి వైద్య శిబిరానికి "వాసన్ ఐ కేర్" నుంచి నిపుణులైన వైద్యులు, సిబ్బంది వారి సేవలను అందించారు. ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఉదాహరణకు సంవత్సరానికి 2 రెండు సార్లు ఉచిత మోగా వైద్య శిబిరం నిర్వహించుట, కరోనా సమయంలో 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్స్ మరియు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ, వరదల సమయంలో నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యవసర సరుకులు మరియు బట్టలు పంపిణి ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సందర్భాల్లో అన్న దానాలు, నిరుపేద విద్యార్ధిని, విద్యార్థులకు ప్రాథమిక మరియు ఉన్నత విద్య కొరకు ఆర్ధిక సహాయం. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అనాధ బాలబాలికలకు మరియు యువతకు నిత్యం అనేక విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తు అండగా ఉండడం సంతోషంగా ఉన్నదని వ్యక్తం చేశారు.


Comments