పీచర గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగకు ఘన ఏర్పాట్లు

పీచర గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగకు ఘన ఏర్పాట్లు

వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ పెద్ద పండగను ఘనంగా నిర్వహించనున్నట్లు కుల సంఘం నాయకులు తెలిపారు. ఈ పండగను మార్చ్ 29, 30, 31 తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కుల అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మంతపురి శ్రీనివాస్, కార్యదర్శి మారబోయిన అశోక్ మాట్లాడుతూ పండగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక పూజలు, హారతులు,  నిర్వహించనున్నట్లు చెప్పారు.
 ఎల్లమ్మ తల్లిని గ్రామ ప్రజలందరూ దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండగ ఏర్పాట్లపై చర్చించారు. గ్రామ ప్రజలు అందరూ పాల్గొని పండగను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .