మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
Views: 48
On
- *ముస్లిం సోదరులకు మంత్రి పొంగులేటి రంజాన్ శుభాకాంక్షలు*
- *కూసుమంచిలో ఘనంగా ఇఫ్తార్ విందు*
ఖమ్మం బ్యూరో, మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు)
మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments