కీసర పీఎస్‌లో ఏసీబీ దాడులు

రూ.35 వేల లంచం తీసుకుంటూ హోంగార్డ్ నగేష్ అరెస్ట్

కీసర పీఎస్‌లో ఏసీబీ దాడులు

కీసర, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

 మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం దాడులు నిర్వహించి హోంగార్డ్ నగేష్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు.మృతుడు తోటకూర మహేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందించాలంటే మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు మృతుడి మేనల్లుడు శరత్ ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరు చెప్పి రిపోర్ట్ త్వరగా తెప్పించాలంటే డబ్బులు అవసరమని నమ్మబలికినట్లు తెలిపారు.నెలలు గడిచినా రిపోర్ట్ అందకపోవడంతో చివరకు రూ.40 వేలుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది.తోటకూర మహేష్ మృతి చెందిన నాలుగు నెలలు గడిచినా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇవ్వలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.నగేష్‌ను అదుపులోకి తీసుకున్నఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన కీసర పీఎస్‌లో సంచలనం రేపింది.IMG-20260228-WA0118

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .