అంగన్‌వాడీలో సామూహిక సీమంతం, అక్షరాభ్యాసాలు.

అంగన్‌వాడీలో సామూహిక సీమంతం, అక్షరాభ్యాసాలు.

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28,(తెలంగాణ ముచ్చట్లు)

తిరుమలాయపాలెం మండలం పరిధిలోని మహ్మదాపురం బొండ తండా గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బోడా మంజు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కవిత హాజరయ్యారు. గర్భిణీలకు ఒడి నింపి బహుమతులు అందజేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గర్భధారణ దశ నుంచి ప్రసవం వరకు అవసరమైన టీకాలు సమయానికి వేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, పోషకాహార సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ లక్ష్మి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ నాయక్, ఆరోగ్య సిబ్బంది రేఖ, ఇందిర, శ్వేత, సారిక, జయమ్మ, ఆశా కార్యకర్త పూలమ్మ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .