నాయకన్ గూడెంలో పీవీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

నాయకన్ గూడెంలో పీవీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 27(తెలంగాణ ముచ్చట్లు)

మండల పరిధిలోని నాయకన్ గూడెంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గొల్లపూడి వీరన్న నూతనంగా నిర్మించిన ‘పీవీ (పవన్)ఫంక్షన్ హాల్’ను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వసతులు ఉండటం సామాజిక కార్యక్రమాలకు దోహదపడుతుందని అన్నారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ ఫంక్షన్ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
 అనంతరం కాంగ్రెస్ పార్టీగ్రామ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న, సూర్య కళ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఎంపీని సత్కరించారు.  
IMG-20260227-WA0049ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ కొండల్, ఉపసర్పంచ్ భీష్మాచారి, మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, కొమురెల్లి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, నాయకులు కంచర్ల వీరారెడ్డి, కంచర్ల పవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి. జహంగీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .