ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఏఎంసీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ శాలువాతో ఘన సన్మానం

ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ఉప్పల్, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, కాప్రా డివిజన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ, పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వారి సతీమణి మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ మాజీ కార్పొరేటర్‌గా ప్రజాసేవలో విశేష అనుభవంతో నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రమిస్తున్నారని కొనియాడారు.దశాబ్దన్నర కాలంగా ప్రజాసేవలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజా పాలనలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఉప్పల్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ దంపతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తన్నీరు శ్రీహరి, అల్లం రాకేష్ యాదవ్, నరేందర్ గౌడ్, అల్లం సాయి యాదవ్, అల్లం సతీష్ యాదవ్, కమలాకర్, సంతోష్ చారి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’ రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’
- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం. సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):  సత్తుపల్లి మండలం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు
విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.