మోజర్లలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం 

మోజర్ల గ్రామ  సర్పంచ్ చంద్రశేఖర్

మోజర్లలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాం 

పెద్దమందడి,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మోజర్ల గ్రామం 1వ వార్డులో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ స్పందించారు.సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.వార్డులో నీటి సరఫరా అంతరాయం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పాత పైపులైన్ లోపాలను సరిచేసి, కొత్త పైపు కనెక్షన్ ఏర్పాటు చేయడంతో నీటి సరఫరా మెరుగుపడిందన్నారు.అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రానున్న ఎండాకాలం తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వార్డులో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని సర్పంచ్ తెలిపారు. స్థానికులు ఈ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .