ఖురాన్ తోనే క్రమశిక్షణ అలవడుతుంది
ఇస్లాం పండితుడు అబ్దుల్ ఖవీ
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి, 27(తెలంగాణ ముచ్చట్లు)
పవిత్ర ఖురాన్ గ్రంధం మనిషి పరిపూర్ణ జీవన విధానానికి దిక్సూచి వంటిదని, దాన్ని చదివి ఎవరైతే అమలు చేస్తారో వారి జీవితంలో చక్కని క్రమశిక్షణ అలవడుతుందని ప్రముఖ ఇస్లాం ఆధ్యాత్మిక పండితుడు మహ్మద్ అబ్దుల్ ఖవి అన్నారు. అందుకే ప్రతి ఒక్క ముస్లిం ఖురాన్ గ్రంధాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నగర శివారు గొల్లగూడెం లోని తాలిముల్ ఇస్లాం మదర్సాలో రంజాన్ మాస తొమ్మిది రోజుల్లో తరవిహ్ నమాజ్ నందు ఖురాన్ పఠనం పూర్తయిన సందర్బంగా ఖత్మే ఖురాన్ వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా మదర్సా ఆవరణలోని మసీదు ప్రాంగణంలో ఆధ్యాత్మిక సభ జరిగింది. ఈ సభ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన అబ్దుల్ ఖవి మాట్లాడుతూ.. ఎంత పెద్ద బాధల్లో ఉన్న వ్యక్తి అయినా.. కొద్దిసేపు ఖురాన్ చదివితే మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. అంతటి గొప్ప శక్తి ఉన్న గ్రంధం ఖురాన్ ను.. రంజాన్ మాసం లో ప్రత్యేకంగా రోజుకొకసారైన చదవడం అలవార్చుకోవాలని సూచించారు. తరావిహ్ నమాజ్ రంజాన్ నెలంతా చదవాల్సిందేనని.. దానికి ఎటువంటి మినహాయింపు ఉండదనే విషయం గ్రహించాలని అబ్దుల్ ఖవి సూచించారు. ఖత్మే ఖురాన్ సందర్బంగా ఆయన ప్రత్యేక ప్రార్ధన చేశారు. అనంతరం మదర్సా ట్రస్ట్
సభ్యులు అబ్దుల్ ఖవి ని శాలువతో ఘనంగా సత్కరించారు. మదర్సా నిర్వాహకుడు ముఫ్తి అబ్దుల్ రవూఫ్ ఖాన్, ముఫ్తి జలాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments