కన్నారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న పోలీసులు – ట్రాక్టర్ స్వాధీనం

వేలేరు, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం కన్నారం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని మరియు వ్యక్తిని వేలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెవుల లింగయ్య (35)అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా గుర్తించారు.
ఈ సందర్భంగా TS 01 UC5843 నంబర్ గల ఇసుక లోడుతో వున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై అజ్మీరా సురేష్ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .