రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన పోలీస్ కమిషనర్

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 23(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన ఖమ్మం కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. ముందుగా పతాకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులు పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు రాష్ట్రాస్థాయిలో క్రీడల్లో అద్బుత ప్రదర్శనతో 15 బంగారు పతకాలు, 8 రజిత పతకాలు, 16 కాంస్య పతకం  మొత్తం 39 పతకాలను కైవసం చేసుకోవడం అభినందనీయమని పోలీస్ కమిషనర్ అన్నారు. ఇదేస్పూర్తితో భవిష్యత్‌లో జాతీయ స్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభను కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పతకాలను సాధించేందుకుగా ముమ్మరంగా సాధన చేయాలని, క్రీడల్లో రాణించే వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని  పోలీస్ కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి,అడిషనల్ డీసీపీ విజయబాబు,ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ఐలు సురేష్, సాంబశివరావు, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ నరేష్ పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .