ఈసీఐఎల్ ఎక్స్ రోడ్‌లో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం

ఈసీఐఎల్ ఎక్స్ రోడ్‌లో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం

కుషాయిగూడ, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

 రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026” ఫేస్–2లో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నిమ్మ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా లేన్ డిసిప్లిన్ పాటించాలని, అనవసర ఓవర్‌టేకింగ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.దాదాపు 50–60 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐపి కే. సతీష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజల భాగస్వామ్యం తో రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలను తగ్గించే లక్ష్యంతో 22.02.2026 నుండి 28.02.2026 వరకు (ఏడు రోజుల పాటు) “అరైవ్ అలైవ్” రెండో దశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.IMG-20260222-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .