ఉప్పల్‌లో పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

ఎంఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మందుముల పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్‌లో పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

ఉప్పల్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు.ఈ మేరకు ఎ. రేవంత్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఆయన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో అనుమతుల కోసం ఎదురుచూస్తున్న పనులు, నిధుల కొరతతో నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను కమిషనర్‌కు వివరించారు.ఉప్పల్ సర్కిల్ పరిధిలో చిలకనగర్ గణేష్ దేవాలయం వద్ద కల్వర్ట్ నిర్మాణం, సీతారామా కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీరప్పగడ్డలో గౌడ్స్ మరియు విశ్వకర్మ శ్మశానవాటికల అభివృద్ధి, రామంతాపూర్‌లో కమ్యూనిటీ హాల్ విస్తరణ, పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న సీసీ రోడ్ల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు.
అలాగే కాప్రా సర్కిల్‌లో వినాయక్ నగర్ ఫేజ్-II, ఎల్లారెడ్డిగూడా, శాలివాహన కాలనీ, నాగార్జున నగర్, వాసవి శివ నగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, బాక్స్ డ్రెయిన్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఓపెన్ జిమ్ & వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ (G+1) నిర్మాణం వంటి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్ డివిజన్లలో కూడా సీసీ రోడ్లు, ఆర్‌సీసీ పైప్‌లైన్, సీనియర్ సిటిజన్ భవనం, శ్మశానవాటిక అభివృద్ధి పనులు అత్యవసరమని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరగా, వినతిపత్రాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .