“శతక్” మూవీని వీక్షించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

“శతక్” మూవీని వీక్షించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

మల్కాజిగిరి, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ప్రస్థానాన్ని ప్రతిబింబించే ఉద్దేశంతో రూపొందించిన “శతక్” చిత్రాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సికింద్రాబాద్ బోయగూడలోని సత్త్వా నెక్లెస్ ప్రైడ్‌లో వీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థ ఆవిర్భావం నుంచి దేశభక్తి, సేవా తత్వం, క్రమశిక్షణ, సాంస్కృతిక పరిరక్షణ వంటి విలువలతో ఎలా ముందుకు సాగిందో చిత్రంలో సమగ్రంగా చూపించారని తెలిపారు. స్వయంసేవకులు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ సమాజ చైతన్యాన్ని పెంపొందించిన తీరు, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఘటనలు, జాతీయ ఏకత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చిత్రంలో హృద్యంగా ప్రతిబింబించాయని పేర్కొన్నారు.ఈ చిత్రం కేవలం ఒక సంస్థ చరిత్రను మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో సమాజం పాత్రను గుర్తుచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం కోసం త్యాగం, సమాజం కోసం సేవ అనే భావన ప్రతి యువకుడి హృదయంలో నాటే ప్రయత్నమే ఈ సినిమా అని అన్నారు.నేటి యువత ఆధునికత, సాంకేతికత మధ్య కూడా తమ మూలాలను మరవకుండా దేశాభివృద్ధిలో సక్రియంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజం ఐక్యంగా ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .