కీసరలో ఘనంగా 211వ వారం జ్ఞానమాల కార్యక్రమం

కీసరలో ఘనంగా 211వ వారం జ్ఞానమాల కార్యక్రమం

ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ హాజరు

కీసర, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ జిల్లా  కీసర మండల అంబెడ్కర్ సంఘం ఆధ్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుడు, జాతీయ గౌడ సంఘం నాయకులు, మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమ ప్రారంభంలో మండల అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ్ మరియు కమిటీ సభ్యులు కలిసి ముఖ్య అతిథికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.సభలో మాట్లాడుతూ వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ పేర్కొంటూ, ఉద్యమం ద్వారానే హక్కులు సాధ్యమవుతాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన 14 ఏళ్ల పోరాటం ప్రజలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి సత్కరించడం గర్వకారణమని తెలిపారు.
కీసర మండలం ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిందని, ఇక్కడ ప్రారంభమైన ప్రతి ఉద్యమం లక్ష్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. జ్ఞానమాల కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం పెంపొందించి, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ పార్టీల జెండాల కింద పనిచేస్తూనే యువత నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘ ప్రతినిధులు, యువత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. సభ అనంతరం జ్ఞానమాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సామాజిక అంశాలపై చర్చలు నిర్వహించారు.IMG-20260222-WA0055

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం