కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భావన గౌడ్
నాచారం, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సంఘసేవకురాలు భావన గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సోమవారం నాచారంలో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.ఈ సందర్భంగా భావన గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలన విధానాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. సమాజానికి సేవ చేయడం తన ధ్యేయమని, కాంగ్రెస్ వేదికగా మరింత విస్తృతంగా ప్రజా సేవ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తనతో పాటు అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరుకానున్నట్లు సమాచారం.


Comments