ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం

వనపర్తి,ఫిబ్రవరి22(తెలంగాణ ముచ్చట్లు):

ఆర్థిక స్థోమత లేక సొంత గృహం నిర్మించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల సొంతింటి కలను ప్రభుత్వం ఇందిరమ్మ గృహాల ద్వారా సాకారం చేస్తోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గృహాలు మంజూరు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండల పరిధిలోని కన్మనూర్ గ్రామానికి చెందిన నంది మహేశ్వరి–నంది రమేష్, ఆస్కాన్ని సత్యమ్మ–కృష్ణయ్య, అస్కానీ లక్ష్మమ్మ–చంద్రయ్య కుటుంబాల నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి హాజరై వారికి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, తమకు గృహం మంజూరు చేసి గృహప్రవేశానికి హాజరైన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం బలిద్‌పల్లి గ్రామానికి చెందిన కరుణ మన్యం  గృహప్రవేశానికి హాజరై వస్త్రాలు అందజేశారు.అలాగే ఇందిరమ్మ దామోదర్ రెడ్డి కుటుంబ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు అందించారు.కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .