కీసరలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చూడడమే నిజమైన నివాళి: డా. డి.బి. జ్యోతి

కీసరలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం

కీసర, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

నవభారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని కె.జె.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు, సామాజిక కార్యకర్త డా. డి.బి. జ్యోతి పిలుపునిచ్చారు.కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని ఆర్‌జీకే కాలనీలో ఆటో స్టాండ్ ప్రాంగణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న “అంబేద్కర్ జ్ఞానమాల” కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం జరిగిన 4వ జ్ఞానమాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి. ఆర్. అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్  విగ్రహాలకు జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన ఆమె, నేడు ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, అవకాశాలు అన్నీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలేనని తెలిపారు. ఆకలి, అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన అహర్నిశలు కృషి చేసి సామాజిక న్యాయం సాధించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతా రాజు ముదిరాజ్, మాజి కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గొల్లూరి రాజు, ప్రధాన కార్యదర్శి వుల్లి సురేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు పులిపాక తిరుపతి, ఈగరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .