మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలి

జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ 

మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలి

వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలని సాహితీ కళావేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషకు సేవలందించిన పలువురు సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ..ఉపాధి అవకాశాల కోసం పరాయి భాషలను ప్రోత్సహించడం అవసరమే అయినప్పటికీ, ఇతర భాషలపై వ్యామోహంతో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. మాతృభాషల మనుగడకు ప్రమాదం తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు బాల్యం నుంచే తమ పిల్లలకు మాతృభాషపై ఆసక్తి, గౌరవం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సందాపురం బిచ్చయ్య, కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, కొత్తకాపు నారాయణ రెడ్డి, మందాపురం సుజాతమ్మ, ఎం.ఏ. సత్తార్ తదితరులను శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్, బెల్లంపల్లి శ్రీనివాసులు, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .