కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో ఉద్రిక్తత

కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు చర్యగా ఈటల నివాసానికి చేరుకున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను ఇంటి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భం గా ఈటల అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల చర్యపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా మరో ప్రజాప్రతినిధిని పరామర్శించడానికి వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు.అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.