ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దమందడి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు):

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి మండలం  మోజర్ల గ్రామ సర్పంచ్, బీఎల్‌వో చంద్రశేఖర్ కోరారు. శనివారం  మోజర్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు, ఇతర వివరాల సవరణలు అవసరమైన వారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శారద , గట్టు మన్నెం, నరసింహా, కొండన్న గ్రామ ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .