గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.
Views: 1
On
వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని పీచర, సోడశపెల్లి గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
(ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) ఉపాధి హామీ పథకం నిధులను వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు కేటాయించినప్పటికీ, పీచర మరియు సోడశపెల్లి గ్రామాలకు మాత్రం నిధులు కేటాయించలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు, సోడశపెల్లి గ్రామ సర్పంచ్ వెన్నం రమాదేవి సంపత్ రెడ్డి పాల్గొని తమ గ్రామాల అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments