విద్యార్థుల భద్రతే లక్ష్యం అధికారులను కదిలించిన అనిల్ కుమార్.

విద్యార్థుల భద్రతే లక్ష్యం అధికారులను కదిలించిన అనిల్ కుమార్.

 ఎల్కతుర్తి, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫార్మసీ కళాశాల వద్ద విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా, భద్రతా సమస్యల పరిష్కారానికి గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ ప్రత్యేక చొరవ చూపారు. విద్యార్థుల ఇబ్బందులను జాతీయ రహదారి (ఎన్‌హెచ్) అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు.
మంగళవారం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్‌హెచ్ అధికారులను కలిసిన అనిల్ కుమార్, కళాశాల ముందు ఉన్న డివైడర్ కారణంగా బస్సులు ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లిపోతుండటంతో విద్యార్థులు కళాశాల వద్ద దిగలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో రహదారిని దాటాల్సి వస్తోందని, ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాల సమీపంలో డివైడర్ కటింగ్ చేయడంతో పాటు బస్సులు ఆగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మించాలని అధికారులను కోరారు. అలాగే వల్భాపూర్ గ్రామానికి ఏర్పాటు చేయాల్సిన సైన్‌బోర్డును పొరపాటున ఇతర గ్రామం పేరుతో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించి, వెంటనే సరిచేసి గ్రామం పేరుతో నేమ్‌బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామానికి సంబంధించిన ఇతర రహదారి సమస్యలను కూడా అధికారులకు వివరించగా, ఎన్‌హెచ్ అధికారులు అన్ని అంశాలను సానుకూలంగా పరిశీలించి డివైడర్ కటింగ్, బస్ షెల్టర్ ఏర్పాటు, నేమ్‌బోర్డు మార్పు తదితర సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల భద్రత, గ్రామ ప్రజల సౌకర్యాల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ చొరవను గ్రామస్థులు అభినందించారు. అధికారుల హామీతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజల్లో ఆనందం వ్యక్తమైంది.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అంబాల కిషోర్, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260616-WA0093

Tags:

Post Your Comments

Comments

Latest News

చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ. చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ.
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...
బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.
చిన్నారుల విద్యా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.
దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!