ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

పెద్దమందడి,జూన్11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని పామిరెడ్డిపల్లి నుంచి బలిజపల్లి వరకు వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతు బాటల నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామ రైతుల ఏకాభిప్రాయం మేరకు ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఈ బాటల పనుల పురోగతిని కలెక్టర్ స్వయంగా పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఉపాధి హామీ సిబ్బందిని అభినందించారు.గ్రామంలో ప్రస్తుతం మరికొన్ని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ తనిఖీలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, పెద్దమందడి తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ మధిర మంజుల–శ్రీశైలం, ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ ఎంపీIMG-20260611-WA0068టీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, గ్రామ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .