హ్యాపీ సండే కార్యక్రమంలో సందడి చేసిన మున్సిపల్ చైర్మన్ దిలీప్.

హ్యాపీ సండే కార్యక్రమంలో సందడి చేసిన మున్సిపల్ చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ జూన్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు.

ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారంలో ఒకరోజు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేలా హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించి వ్యాయామం, క్రీడలు, శారీరక శ్రమను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం మైదానంలో పాల్గొన్న ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హాజరైన చిన్నారులతో కలిసి కొంతసేపు క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలుగురి సురేష్, మాచర్ల రాజు, దిడ్డి రాము, మేనేజర్ జి. రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఏఈ వికాస్, గోవింద్, కుమారస్వామి, సాయి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .