మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.

వనపర్తి,జూన్08(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వనపర్తిలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం, బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము వెంకటస్వామిని మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.వెంకటస్వామి మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్యకర్తలందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.కార్యక్రమంలో వెల్టూర్ మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్, గట్లఖానాపూర్ మాజీ ఎంపీటీసీ శివశంకర్, గట్లఖానాపూర్ మహేష్, అమ్మపల్లె బాలు, మద్దూర్ వెంకటయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి. గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.
మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు):  గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్...
మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.
గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.
ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరిస్తాం.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎల్కతుర్తి పోలీసుల ఉక్కు పాదం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.