బీటెక్‌ ఫలితాల్లో సాయిస్ఫూర్తి విద్యార్థుల సత్తా.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన కళాశాల.

బీటెక్‌ ఫలితాల్లో సాయిస్ఫూర్తి విద్యార్థుల సత్తా.

సత్తుపల్లి, జూన్‌ 4 (తెలంగాణ ముచ్చట్లు): 

జేఎన్‌టీయూహెచ్‌ విడుదల చేసిన బీటెక్‌ మూడో సంవత్సరం ఫైనల్‌ పరీక్షల ఫలితాల్లో బి.గంగారం సాయిస్ఫూర్తి అటానమస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అగ్రస్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వూటుకూరి శేషారత్నకుమారి తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు అధిక ఎస్‌జీపీఏ సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచారని పేర్కొన్నారు.
 *ఈఈఈ విభాగం* : పెరికలపాటి ప్రకాష్‌ – 7.9 ఎస్‌జీపీఏ (74%), సురోజు శ్రీకర్‌ – 7.85 ఎస్‌జీపీఏ (73.5%), తాటి విశాల్‌ హర్షవర్ధన్‌రావు – 7.8 ఎస్‌జీపీఏ (73%).
 *ఈసీఈ విభాగం* : బాడిత శ్రీనివాస్‌ – 8.95 ఎస్‌జీపీఏ (84.5%), గౌర గోపీచంద్‌ – 8.8 ఎస్‌జీపీఏ (83%), ఎర్ర ధన్యశ్రీ – 8.8 ఎస్‌జీపీఏ (83%), వేముల రమ్య – 8.65 ఎస్‌జీపీఏ (81.5%).
 *సీఎస్‌ఈ విభాగం*:  షేక్‌ ఇసుబ్‌ అలియా – 9.7 ఎస్‌జీపీఏ (92%), అచ్ఛే దుర్గాదీక్షిత – 9.1 ఎస్‌జీపీఏ (86%), గుంజి నవ్య – 9.1 ఎస్‌జీపీఏ (86%), పుచ్చకాయలు జ్యోత్స్నారెడ్డి – 9.1 ఎస్‌జీపీఏ (86%), దిశలే తేజశ్రీ – 8.95 ఎస్‌జీపీఏ (84.5%).
 *సీఎస్‌ఈ (ఏఐ అండ్‌ ఎంఎల్‌)* విభాగం: లింగం చందన – 8.95 ఎస్‌జీపీఏ (87.5%), కాండూరి లక్ష్మీప్రియ – 8.95 ఎస్‌జీపీఏ (84.5%),
భోగవల్లి లీలసాయి – 8.8 ఎస్‌జీపీఏ (83%), మహమ్మద్‌ రజియా – 8.8 ఎస్‌జీపీఏ (83%), నర్వనేని అక్షర – 8.8 ఎస్‌జీపీఏ (83%).
 *ఏఐ అండ్‌ డీఎస్‌* విభాగం: అమరవరపు మాధురి – 9.7 ఎస్‌జీపీఏ (92%), చిమ్మి రమ్య – 9.1 ఎస్‌జీపీఏ (86%), ముచ్చర్ల హేమంత్‌ సాయిసుబ్రహ్మణ్యం – 9.1 ఎస్‌జీపీఏ (86%), గోగిరెడ్డి నిఖిత – 8.95 ఎస్‌జీపీఏ (84.5%), గువ్వల ఆమనీ సత్యభాస్కర ప్రియ – 8.95 ఎస్‌జీపీఏ (84.5%), కారుమూరి ప్రణయ్‌ వెంకటసాయి – 8.95 ఎస్‌జీపీఏ (84.5%), పుచ్చకాయలు అక్షయరెడ్డి – 8.95 ఎస్‌జీపీఏ (84.5%).
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్‌ ట్రస్టీ బండి అన్విద వర్చువల్‌గా విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ దాసరి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పరీక్షలు విజయానికి సోపానాలని, కృషి చేసిన వారికి ఫలితం తప్పకుండా దక్కుతుందని అన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాముల శేఖర్‌బాబు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ యాకూబ్‌, వివిధ శాఖల అధిపతులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .