పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినమే పెంతెకొస్తు పండుగ.
◆ పెంతెకొస్తు పండుగ దినమున ధర్మశాస్త్రం ఆమోదించబడింది
◆ అసెంబ్లీ ఆఫ్ యావె మినిస్ట్రీ పాస్టర్ పాలడుగు రత్నపాల్
ఖమ్మం బ్యూరో , మే 24 (తెలంగాణ ముచ్చట్లు )
పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినమే పెంతెకొస్తు పండుగ అని, పెంతెకొస్తు పండుగ దినమున ధర్మశాస్త్రం ఆమోదించబడిందని ఈ పండుగను పరిశుద్ధ గ్రంధం బైబిల్ నందు ప్రవక్తలు, యాషువ మెస్సీయ, అపోస్తులలు పాటించారని, విశ్వాసమున్న ప్రతిఒక్కరూ ఈ పండుగను ఆచరించాలని, ఇది 'ఆజ్ఞ' అని అసెంబ్లీ ఆఫ్ యావె మినిస్ట్రీ పాస్టర్ పాలడుగు రత్నపాల్ అన్నారు. ఖమ్మం నగరంలోని రమణగుట్ట యావె సమాజ ప్రార్థన మందిరంలో ఆదివారం పెంతెకొస్తు పండుగ(వారముల పండుగ)ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలడుగు రత్నపాల్ బైబిల్ గ్రంధాన్ని బోదిస్తూ.. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ను ప్రామాణికంగా తీసుకొని విశ్రాంతిదినమును(సబ్బాత్), నెలపొడుపు దినము, పండుగలు ఎలోహిం (దేవుని) కట్టడులని, బైబిల్ ను నమ్మి విశ్వసించేవారందరూ తప్పకుండా ఆచరించాలని బోధించారు. బైబిల్ పండుగలలో పెంతెకొస్తు (ప్రథమ ఫలాల) పండుగ ప్రత్యేకమైనదన్నారు. ఈ పండుగ దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చినదని, అలాగే ధర్మశాస్త్రము ఆమోదించబడిందని లేఖనాలు తెలియజేస్తున్నాయన్నారు. లేఖనాలైన లేవియాకాండం 23 : 11, 16, ద్వితియోపదేశకాండము 16 : 16, అపోస్తుల కార్యములు 2 : 1 లలో స్పష్టం చేస్తున్నాయన్నారు. తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు, హిబ్రూ, గ్రీకు తదితర బాషలలో బైబిల్ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో నిష్ఠగా పఠనం చేస్తేనే దినాలు, విశ్రాంతిదినము(సబ్బాత్), పండుగలు, ధర్మశాస్త్రమును ఎలోహిం(దేవుడు) శాస్త్రీయంగా వాస్తవాన్ని బయలుపర్చుతాడని బోధించారు. ఈ పండుగ సందర్భంగా వాయిద్యాలతో యావె, యాషువ మెస్సీయ గీతాలను విశ్వాసులు, యువకులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో పాడి ఆనందింపజేశారు. అనంతరం పరమతండ్రి యావె అంటూ యాషువ మెస్సీయ పేరున ప్రార్థనలు జరిపారు. ఈ పండుగ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో పాత నిబంధనలో 49 సార్లు, క్రొత్త నిబంధనలో 3 సార్లు మొత్తంగా 52 సార్లు వ్రాయబడిందన్నారు. పూర్తి వివరాలకు సెల్ నెం. 9989841107 సంప్రదించండి. ఈ కార్యక్రమంలో సువార్త సహకారులు మోదుగు మోషే, అంబోజి జీవరత్నం, వడ్లమూడి ప్రశాంత్, బి. పౌలు (రూప్లాల్), పాలడుగు జీవన్, సామేలు, కొరకొప్పుల డేవిడ్, గడ్డం ఏబేలు, మోదుగు దానియేలు, రోహిత్, ఐజెక్, రామ్ స్నేహిత్, ప్రిన్స్, పాలడుగు అనిత, పావని, స్వరూప, కళమ్మ, రూతు, సునీత, సుధ, ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు.


Comments