పీచరలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

పీచరలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

వేలేరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు  జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి శానిటేషన్ సామగ్రి, యూనిఫాం డ్రెస్సులు, బ్లౌజ్ పీసులు, చెప్పులు, మాస్కులు, సబ్బులు, నూనె, షూస్ తదితర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు.సర్పంచ్  మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతకు నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారి సంక్షేమానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.త్యాగాల పునాదిపై నిర్మితమైన తెలంగాణ ప్రతి పౌరుడి  ఆత్మగౌరవానికి ప్రతీక అమరవీరుల ఆశయాలే మన బాట... బంగారు తెలంగాణే మన లక్ష్యం.తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, సమానత్వం దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట అనిల్, గ్రామ ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డ్ సభ్యులు కొలిపాక వెంకటేష్, గుడికందుల రాకేష్, ఒద్దుల శ్రీకాంత్, జేరుపోతుల జగన్, ఉప్పుల శ్రీధర్ రెడ్డి, గుండెల్లి సౌజన్య, ఎడ్ల అశ్విని, రామంచ ప్రశాంత్, పురామణి కవిత, జల్తరీ సుకన్య, గ్రామ పాలన సంబంధిత అధికారులు, IMG-20260602-WA0152గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .