తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.
Views: 85
On
భీమదేవరపల్లి, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూరు అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డ్యాగల సారయ్య, జాలి ప్రమోద్ రెడ్డి, ఆదరి రవి, ఎదులాపురం తిరుపతి, శనిగరం సది, చిట్కూరి అనిల్, లక్ష్మారెడ్డి, గద్వాల ప్రశాంత్, చెప్యాల ప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments