భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.

భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.

భీమదేవరపల్లి, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు)

భీమదేవరపల్లి గ్రామపంచాయతీలో సోమవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో గ్రామ ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
గ్రామంలో మద్యం అక్రమ విక్రయాలను అరికట్టి, యువతను మద్యం వ్యసనానికి దూరంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశంలో సభ్యులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య, గ్రామ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ప్రేమలత, సదానందం, శ్రీనివాస్ రెడ్డి, పోలు అశోక్, సాగంటి వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యామ్, విజయ, సంధ్య పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .