సిగ్నల్ కోసం ఎదురుచూపులు.. పని లేక నిరాశలో కార్మికులు.

సిగ్నల్ కోసం ఎదురుచూపులు.. పని లేక నిరాశలో కార్మికులు.

వేలేరు, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులు సిగ్నల్ సమస్య కారణంగా తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. పనులకు హాజరయ్యే కార్మికుల ముఖ గుర్తింపు (ఫేస్ అటెండెన్స్) నమోదు కోసం మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడంతో కార్మికులు పని ప్రదేశాల వద్ద నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
సిగ్నల్ అందకపోవడంతో హాజరు నమోదు కాక పనులు ప్రారంభించలేకపోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పనులకు వచ్చినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా సమయం వృథా అవుతోందని, దీంతో ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటున్నాయని వారు తెలిపారు.
గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించి, ఉపాధి హామీ పనులు సజావుగా సాగేందుకు అధికారులుతక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. IMG-20260602-WA0166

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .