శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

పెద్దమందడి,మే22(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు జి. సతీష్ శర్మ గారి తండ్రి, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ శర్మ  అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి వెంట గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, రఘువర్ధన్ రెడ్డి, భూషయ్య, నరేష్, ఖాజా హుస్సేన్, రమేష్, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .