ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.

వైద్య సేవలను మెరుగుపరచాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సూచన.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.

హుజురాబాద్, మే22(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి  ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ సీడీ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ తీరును తెలుసుకున్నారు.
ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమయానికి చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష, సిబ్బంది సదానందం, ప్రతాప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .