ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.

ఇంద్రనగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజు 

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.

ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజు మాట్లాడుతూ, మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ప్రత్యేక చొరవతో గ్రామానికి నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరైందన్నారు. అయితే టెండర్ పొందిన కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేసి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
గ్రామపంచాయతీ కార్యాలయం లేకపోవడంతో ప్రజలకు అవసరమైన ధృవపత్రాలు, సంక్షేమ పథకాల సేవలు అందించడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కార్యాలయం నిర్వహించేందుకు గ్రామంలో సరైన భవనం కూడా లేక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత కాంట్రాక్టర్‌పై తక్షణ చర్యలు తీసుకొని టెండర్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని సర్పంచ్ అంబాల రాజు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్.
ఎల్కతుర్తి , మే 22 (తెలంగాణ ముచ్చట్లు): ఇందిరానగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రామపంచాయతీ భవన పనులను నిర్లక్ష్యంగా కొనసాగిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్‌పై...
సమాజ సేవకుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయం.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఆకస్మిక తనిఖీ.
గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధిత రైతుల ఆగ్రహం.
సమాజ సేవకుడికి “దళిత రత్న” పురస్కారం.
శ్రీనివాస్ శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.