బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన సన్మానం
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : ఇంగిలే రామారావు
ఇల్లంతకుంట, మే 18: తెలంగాణ ముచ్చట్లు
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులై తొలి సారి కరీంనగర్‌కు విచ్చేసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. కరీంనగర్ ఇందిరా భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన చైర్మన్ ఇంగిలే రామారావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపు కుల ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి సేవలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సెక్రటరీ మేకమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి శివకుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.


Comments