మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.

మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.

పెద్దమందడి,మే20(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రెండో వార్డును సందర్శించి పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా వార్డులోని మోరీల శుభ్రత, కంప చెట్ల తొలగింపు అంశాలను పరిశీలించారు.అలాగే మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి సక్రమంగా సరఫరా అవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు.వీధి దీపాలు ప్రతి స్తంభానికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించారు.అదేవిధంగా రెండో వార్డు ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు రెండో వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, వార్డు ప్రజలు కొండా శేఖర్ రెడ్డి, గొంది ప్రతాప్ రెడ్డి, బంకుల చల్మారెడ్డి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .