ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా సభ గోడపత్రిక ఆవిష్కరణ

ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా సభ గోడపత్రిక ఆవిష్కరణ

పెద్దమందడి,మే20(తెలంగాణ ముచ్చట్లు):

సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా.. అనే నినాదంతో ఈ నెల 31న వనపర్తి జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను పెద్దమందడి మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య కార్యాచరణ సమితి మండల కన్వీనర్ ఆర్. ఈశ్వర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతుతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో (ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాంగణం) ఈ బహిరంగ సభ జరగనున్నట్లు చెప్పారు.బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మధు మహారాజ్‌తో పాటు ఈశ్వర్, శాంతన్న, భగవంతు, మధుసూదన్, జీవన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .