పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం.

పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం.

ఖిల్లా ఘనపూర్,మే19(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ క్యామ నవనీత, వైస్ చైర్మన్ కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ల ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి  ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.ఇటీవల నూతనంగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సాయిచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి మార్కెట్ యార్డ్ కమిటీ సమిష్టిగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ క్యామ నవనీత, వైస్ చైర్మన్ కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తూ తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .