వేలేరు మండల కేంద్రంలో 5 కే రన్, 2కే వాక్‌థాన్ ఘనంగా నిర్వహణ.

వేలేరు మండల కేంద్రంలో 5 కే రన్, 2కే వాక్‌థాన్ ఘనంగా నిర్వహణ.

వేలేరు, మే 18 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో 5కే రన్ మరథాన్, 2కే వాక్‌థాన్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి (వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ – వేలేరు మేజర్ గ్రామపంచాయతీ), ఎంఈఓ చంద్ర మొగిళి , ఎంపీఓ అఫ్జల్, ఏపీఓ విజయ, ఏఈ హౌసింగ్ అభిలాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు సంబంధించిన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 5కే రన్ మరియు వాక్‌థాన్ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు.
నిత్యం వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, పౌష్టికాహారం తీసుకోవడం కూడా అత్యంత అవసరమని సూచించారు. అలాగే మండల స్థాయిలో ఈ వారోత్సవాల్లో భాగంగా క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్పంచ్ మరియు అధికారులు పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది రవి ప్రసాద్, రాజేశ్వర్, ప్రదీప్, కరుణాకర్, వార్డు సభ్యులు, యువజన సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News