ఎల్కతుర్తి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.

ఎల్కతుర్తి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.

–ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ 

– ఎమ్మార్వో కార్యాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలు

ఎల్కతుర్తి, మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సర్కిల్ చౌరస్తా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎల్కతుర్తి ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఎల్కతుర్తి సర్కిల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, వాహనాలు ఇష్టానుసారంగా రాకపోకలు సాగించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వేగంగా వచ్చే వాహనాలను నియంత్రించే స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్కతుర్తి చౌరస్తా రోజురోజుకు ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారుతోందని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు మాత్రం శాశ్వత చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఈ రహదారిపై అధికంగా ప్రయాణిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి.
ఎల్కతుర్తి చౌరస్తా వద్ద వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, ట్రాఫిక్ పోలీసులను నియమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.IMG-20260515-WA0088

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?