డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.

డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.

జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిర్యాదిదారురాలు పిట్టల స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త పిట్టల భద్రయ్య (40), ముదిరాజ్, ఆబాది గ్రామానికి చెందినవాడు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భద్రయ్య, మే 15 ఉదయం తన ద్విచక్ర వాహనం AP15 AW 7501 స్ప్లెండర్ బైక్‌పై జగ్గయ్యపల్లికి వడ్ల శాంపిల్స్ చూపించడానికి వెళ్లాడు.
తిరిగి జగ్గయ్యపల్లి నుండి ఇంటికి వస్తుండగా రంగమ్మపల్లి గ్రామ సమీపంలోని ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర వెనుక నుంచి వచ్చిన TS02 UD 2120 నంబర్ గల డీసీఎం వ్యాన్ అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భద్రయ్య రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తల వెనుక భాగంలో, కుడి కన్ను వద్ద తీవ్ర రక్త గాయాలు అయ్యాయి.
స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హన్మకొండలోని హాజర హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం భద్రయ్య అక్కడ చికిత్స పొందుతున్నాడు.
అనంతరం ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం డ్రైవర్ ఎలిబాక శ్రవణ్ కుమార్ (25), తండ్రి సదయ్య, రెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?