మోదీ పిలుపు అమలు.. సైకిల్‌పై 15వ వార్డులో పర్యటించిన చైర్మన్ దిలీప్.

మోదీ పిలుపు అమలు.. సైకిల్‌పై 15వ వార్డులో పర్యటించిన చైర్మన్ దిలీప్.

జమ్మికుంట టౌన్ మే 15 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలోని 15వ వార్డులో శానిటేషన్, పరిశుభ్రత పనులను మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సైకిల్‌పై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న శానిటేషన్ పనులను టీం వర్క్‌తో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అవసరమైతే తప్ప బైక్‌లు, ఇతర వాహనాలు ఉపయోగించకుండా ఉండాలని సూచించారని, అందుకే తాను సైకిల్‌పై వార్డు సందర్శన నిర్వహించినట్లు చెప్పారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, స్థానిక కౌన్సిలర్ పాతకాల మౌనిక అనిల్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఏఈ వికాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .